కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాశవ్వ అనే మహిళ, తన భర్త అమృతం విఠల్‌ను చంపడానికి ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చింది. భర్త అనారోగ్యం, వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. కాశవ్వను, ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.