విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసిందని.. కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కేంద్రం ఇచ్చిన 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఉక్కు కర్మాగారం రక్షణకు కాకుండా.. ఇతర ఖర్చులకు వాడేందుకంటూ ప్రచారం జరిగింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయమై దర్యాప్తు చేపట్టిన సజగ్ టీమ్.. ఇది తప్పుడు ప్రచారం అని తేల్చింది.