Visakhapatnam Parcel Ganja: ఏపీలో మరో గంజాయి దందా బయటపడింది. కొంతకాలంగా డ్రైఫ్రూట్స్ పేరుతో విశాఖ నుంచి ఢిల్లీకి కొరియర్‌లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తేల్చారు.. గంజాయి ఉన్న కొరియర్ పార్సిల్స్‌ను గుర్తించారు. వీళ్లు కొరియర్ సర్వీసులువారికి బురిడీ కొట్టించి డ్రై ఫ్రూట్స్ మాటున గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. అలాగే పోలీసులు రైల్వే స్టేషన్‌లలో కూడా తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.