విశాఖలోని ఇందిరాగాంధీ జూకు అరుదైన అతిథి వచ్చింది. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత విశాఖ జూలో బ్లాక్ పాంథర్ సందడి చేయనుంది. అస్సాం నుంచి జంతు మార్పిడి పద్ధతిలో విశాఖ జూకు బ్లాక్ పాంథర్ రప్పించారు. మంగళవారం రోజున బ్లాక్ పాంథర్‌ను ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. మార్చి నుంచి ఒకటిన్నర నెలపాటు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ చిరుతను నిహిరా అనే 21 నెలల చిన్నారి పేరు మీద ఆమె కుటుంబసభ్యులు దత్తత తీసుకున్నారు.