ఏపీలోని యువతకు సూపర్ న్యూస్.. విశాఖపట్నంలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలోని డల్లాస్ టెక్నాలజీ సెంటర్.. టీసీఎస్‌కు కేటాయించింది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్‌ను టీసీఎస్‌కు లీజుకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు అంతస్తులు ఉన్న ఈ భవనంలో 1400 మంది పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు తొలి విడతలో 2 వేల మందితో కార్యకలాపాలు ప్రారంభిస్తామని టాటా గ్రూప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.