విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాకతో తర్లువాడ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ ప్రధాన క్యాంపస్ రాబోతోంది. ఈ ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోయిన వారికి ఎకరానికి రూ. 50 లక్షల చొప్పును ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. డేటా సెంటర్ వల్ల ప్రభావితుమైన కుటుంబానికి 20 సెంట్ల భూమి, ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తోంది. అంతేకాకుండా ఇళ్లు కట్టుకోవడానికి మూడు సెంట్ల స్థలం కూడా ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ తమ ఊరి రూపురేఖలను మార్చేస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.