Visakhapatnam Acb Raids On Ghmc Zonal Commissioner Simhachalam: విశాఖపట్నం జీవీఎంసీ జోన్-2 కమిషనర్ పొందూరు సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఎన్నికలకు ముందు విశాఖ నుంచి బదిలీ అయ్యారు.. రెండు నెలల కిందట తిరిగి జీవీఎంసీకి బదిలీపై వచ్చి జోన్-2 కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆయన నివాసం, జోన్-2 కార్యాలయం, ఆయన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలోని తల్లిదండ్రుల ఇల్లు, కింతలిలోని అత్తవారి ఇల్లు, కొత్తపేటలోని వియ్యంకుడి నివాసంతోపాటు హైదరాబాద్‌లోని కుమార్తె ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.