Visakhapatnam Couple Suicide Jump From Building: విశాఖపట్నంలోని గాజువాకలో అనుమానాస్పద రీతిలో ఓ జంట భవనంపై నుంచి పడి చనిపోవడం కలకలం రేపింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మిత గాజువాకలోని ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి పడిపోయినట్లు గుర్తించారు. వీరు మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. భవనంపై నుంచి కిందపడే ముందు వారి గదిలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.