విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీగా నకిలీ నోట్లు లభ్యమైన సంగతి తెలిసిందే. పోలీసుల తనిఖీలలో ఇద్దరు యువకుల వద్ద రూ.3.32 లక్షల విలువైన దొంగనోట్లు లభ్యమయ్యాయి. దీంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ విషయంపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంక్రాంతి కోడిపందేల వద్ద నకిలీ నోట్లను చెలామణి చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవాలనే ఆశతో ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ప్లా్న్ ఫలించకపోవటంతో విశాఖలో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చి పోలీసులకు చిక్కిపోయారు ఇద్దరు యువకులు .