ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయించినట్లు తెలిసింది. కోట్ల విలువైన స్థలాన్ని తక్కువ రేటుకే కేటాయించారనే ఆరోపణలపై దర్యాప్తు జరిపిన ప్రభుత్వం.. అనుమతులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అలాగే తిరుమలలో శారదా పీఠం నిర్మాణాలపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించినట్లు సమాచారం. ఇక స్థలం అనుమతుల రద్దుపై సోమవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.