CBI Says No Drugs Found In Visakhapatnam Container: విశాఖపట్నం వచ్చిన ఒక కంటైనర్ విషయంలో మిస్టరీ వీడింది. డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ కొకైన్ ఉన్నాయనే అనుమానాలు రావడంతో సీజ్ చేశఆరు. కంటైనర్ నుంచి సేకరించిన డ్రై ఈస్ట్ నమూనాలను సెంట్రల్ నార్కోటిక్ డ్రగ్స్ లేబొరేటరీకి పంపించారు. అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు(డ్రగ్స్) లేవని నివేదిక వచ్చింది. అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సమర్పించి.. కేసును మూసేయాలని సీబీఐ అధికారులు కోరారు. కోర్టు ఆమోదం తెలపడంతో ఆ కంటైనర్‌ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్ అధికారులకు 10 రోజుల క్రితం లేఖ రాశారు. ఈ మేరకు సదరు సంస్థకు సమాచారం ఇచ్చారు.