Vizag Durg Vande Bharat Express Fares:విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ నెల 16న ఈ రైలు ప్రారంభంకాగా.. శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురంలో ఆగుతుంది. ఈ వందేభారత్ రైలుకు సంబంధించిన ఛార్జీలు నిర్ణయించారు.. అయితే ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు. మరోవైపు తొలిరోజు ఈ వందేభారత్ రైలుకు పెద్దగా ఆదరణ రాలేదు అంటున్నారు.