Visakhapatnam NAD Railway Bridge Ready: విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా మరో ముందడుగు పడింది. నగరంలో కీలకమైన ఎన్ఏడీ కూడలి దగ్గర కాకానినగర్ దగ్గర ఆర్వోబీ ప్రారంభానికి సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ పనునలు ముగింపు దశలో ఉండగా.. ఈ ఆర్వోబీని ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకానినగర్ కూడలికి సమీపంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.