Visakhapatnam Metro UMTA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి కీలక ముందడుగు వేసింది. యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంతో సంప్రదింపులు, నిధుల కోసం యూఎంటీఏను ఏర్పాటు చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే యూఎంటీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమిని సేకరించే పనిలో ఉంది.