ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా పేరొందిన విశాఖ నగరం.. పారిశ్రామికంగా, పర్యాటకంగా ముందంజలో ఉంది. దీంతో ఇక్కడ హోటళ్ల నిర్మాణానికి అనేక ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా బీచ్ వ్యూతో స్టార్ హోటళ్ల నిర్మాణానికి అనేక సంస్థలు సుముఖంగా ఉన్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న గేట్ వే హోటల్‌ను కూల్చి వేసి.. దాని స్థానంలో 24 అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించే దిశగా వరుణ్ గ్రూప్ అడుగులు వేస్తోంది.