Visakhapatnam 837 License Suspended: విశాఖపట్నంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. పది రోజులుగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఎక్కువశాతం మంది హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నారు. హెల్మెట్ నిబంధనను ఉల్లంఘించినందుకు వారి లైసెన్సుల్ని మూడు నెలల పాటూ తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే బైక్ నడిపేవారితో పాటుగా వెనుక కూర్చునేవారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయంటున్నారు.