విశాఖపట్నంలో ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కయ్యపాలెం పరిధిలో యువతిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే తనపై ఎలాంటి దాడి జరగలేదని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఆటోలో అగ్గిపుల్ల వెలిగించేందుకు యత్నిస్తే మంటలు చెలరేగినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చిందని విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీసులు చెప్పారు. అయితే మరో స్నేహితురాలితో కలిసి యువతి ఆటో ఎక్కినట్లు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఘటన తర్వాత ఆ స్నేహితురాలు కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.