విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మెడికో బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనం మీద నుంచి దూకి శ్రీరామ్ అనే మెడికో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కాలేజీ వైస్ ప్రిన్సిపల్ వేధింపులతోనే మెడికో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.