విశాఖపట్నం సాగర్ నగర్-ఎండాడ సమీపంలో రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో ప్రతిష్టాత్మక హయత్ 5-స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్, గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సీఐఐ సమ్మిట్ ఫలితంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ రానున్న రెండేళ్లలో అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. ఇది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పిస్తూ విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో కీలకం కానుందని చెప్పారు.