Visakha Vimala Vidyalayam Reopened: విశాఖపట్నంలో 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న విమల విద్యాలయం స్కూల్ మళ్లీ ప్రారంభమైంది. గతేడాది మూతపడిన ఆ పాఠశాల బాధ్యతల్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది.. ఈ ఏడాది స్కూల్ ప్రారంభమైంది. గతంలో ఈ స్కూల్‌లో రూ.12వేలు ఫీజు వసూలు చేయగా.. ఇకపై ఉచితంగానే విద్యను అందించనున్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణకుమార్ రాజు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌లు కలిసి ఈ స్కూల్‌ను ప్రారంభించారు.