తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ (99) కన్నుమూశారు. ఈ నెల 25న ఇంట్లో ప్రమాదవశాత్తు గాయపడిన ఆమెను.. హైదరాబాద్ నగరంలోని ఏ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో, ఆమె భర్త దొడ్డా నర్సయ్య (మాజీ ఎమ్మెల్యే)తో కలిసి మూడేళ్లు అజ్ఞాతవాసం గడిపారు, కమ్యూనిస్టు పార్టీ కొరియర్‌గానూ పనిచేశారు.