సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కోసం ఉద్యోగులు 8 గంటల పనివేళలను పూర్తిగా వినియోగించి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని సీఎండీ ఎన్. బలరామ్ కోరారు. పోటీని తట్టుకోవడానికి ఇది తప్పనిసరన్నారు. భవిష్యత్తులో సింగరేణిని 10 రాష్ట్రాలకు విస్తరిస్తామని, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ వంటి అనుబంధ సంస్థలను ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా రూ.300 కోట్లతో వెయ్యి క్వార్టర్లు, గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.