వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రేంజులో ఫైరయ్యారు. కేసులతో కూటమి ప్రభుత్వం తమను వేధిస్తోందన్న పేర్ని నాని ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. మంత్రిగా పనిచేసిన సమయంలో పేర్ని నానికి ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు, పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మాట్లాడినప్పుడు ఏమైందని నిలదీశారు. సీఎం నారా చంద్రబాబు దేవుడు కావునే.. వైసీపీ వాళ్లు బయటకు వస్తున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ పాలనలో తమను బయట తిరగనివ్వలేదన్నారు. పేర్ని నానిని వదిలేది లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇంకోసారి మీడియా ముందుకువచ్చిన ఇష్టానుసారం మాట్లాడితే వీపు విమానం మోగిస్తానని హెచ్చరించారు.