వృద్ధ దంపతులపై గవర్నమెంట్ ఆసుపత్రి స్టాఫ్ దాష్టీకం

3 weeks ago 3
పండటాకులపై జగిత్యాల ప్రభుత్వసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు అందరినీ కలిచివేస్తోంది. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో అతడి భార్య మల్లవ్వ 9 రోజుల క్రితం జగిత్యాల ఆస్పత్రిలో చేర్చించింది. అప్పటికే ఆమెకు చేయి విరగ్గా బ్యాండేజీతోనే భర్తకు సేవలు చేస్తోంది. అయితే శుక్రవారం బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ ఆస్పత్రిలో భర్తకు కేటాయించిన బెడ్‌పై పడుకుంది. దాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది పేషెంట్‌కి కేటాయించిన బెడ్‌పై నువ్వెలా పడుకుంటావంటూ మల్లవ్వపై మండిపడ్డారు. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో కాసేపు పడుకున్నానని చెప్పగా ఆమెను బలవంతంగా లేపి వీల్‌ చైర్లో కూర్చోబెట్టి ఆస్పత్రి బయటకు పంపేశారు. భార్య పరిస్థితి చూసి తట్టుకోలేక పోయిన రాజనర్సు ఆమెను వెతుక్కుంటూ ఆస్పత్రికి బయటకు వచ్చేశాడు.
Read Entire Article