చీరాల టూటౌన్ సీఐ శశికుమార్.. ఓ మహిళను దూషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఐ శశికుమార్ ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. తాను అన్న మాటలనే వీడియోలో ఉంచారని.. అంతకు ముందు వృద్ధురాలు మాట్లాడిన మాటలు లేవని పేర్కొన్నారు.