తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇక చంటి పిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పిస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ప్రతి నెలా ఈ కోటా టోకెన్లు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఆఫ్‌లైన్‌లోనూ వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం కల్పించే దిశగా టీటీడీ ఆలోచన చేస్తోంది.