సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి డెయిరీ ఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 పిల్లర్ల నిర్మాణం పూర్తి కాగా.. బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద 600 మీటర్ల సొరంగ మార్గానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.1,478 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల గంట ప్రయాణ సమయం 15 నిమిషాలకు తగ్గనుంది. రక్షణ శాఖ భూముల సేకరణ పూర్తి కాగానే శామీర్‌పేట్ కారిడార్ పనులు కూడా ఊపందుకోనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తొలిగిపోనున్నాయి.