వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. రూ.584 కోట్లతో మూడు దశల్లో చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన మండపాలు స్లాబ్ దశకు చేరుకున్నాయి. ఆలయ పనులకు ఇప్పటివరకు రూ.40 కోట్లు, నిత్యాన్నదాన సత్రానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.