తెలంగాణలో జరగనున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీపీఐ, టీజేఎస్ నాయకులతో సమావేశమై.. వారి మద్దతు కోరారు. సామ రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సీపీఐ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సానుకూలంగా స్పందించినప్పటికీ పార్టీ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.