వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొ్న్నారు. వైఎస్ జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడే వైఎస్ అభిషేక్ రెడ్డి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ అభిషేక్ రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలను శనివారం ఆయన స్వగ్రామం పులివెందులలో నిర్వహించారు. అంత్యక్రియలకు వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, కుటుంబ సభ్యులు హాజరై అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ అభిషేక్ రెడ్డి అంతిమయాత్రలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.