Andhra Pradesh High Court Ys Jagan Security: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు సంబంధించి.. ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ బుధవారం తమకు అందిందని జగన్ తరఫు లాయర్ హైకోర్టుకు నివేదించారు. దానిని పరిశీలించి రిప్లయ్ వేసేందుకు సమయం ఇవ్వాలని.. విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన కోర్టు.. విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌లో కీలక విషయాలు వెల్లడించింది.