Ys Sharmila Tweet On Jagan Adani Issue: ఏపీ రాజకీయాల్లో అదానీపై అమెరికాలో కేసుకు సంబంధించిన ఎపిసోడ్ దుమారం రేపుతోంది.. టీడీపీతో పాటుగా కాంగ్రెస్ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసింది. ఈ అంశంపై వైెఎస్ షర్మిల ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా వైఎస్ జగన్ ఈ అదానీ అంశంపై స్పందించి.. అసలు అమెరికాలో నమోదైన కేసులో తన పేరు కూడా లేదన్నారు. అయితే షర్మిల వైఎస్ జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు.