వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు.. సీఎం చంద్రబాబు ఫైర్

1 month ago 6
మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ ఉన్నా ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్‌ గుంటూరుకు వెళ్లి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలని వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు చురకలు అంటించారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున గుంటూరు మిర్చి యార్డుకు రావడానికి వీలు లేదని పోలీసులు కూడా వైఎస్ జగన్‌కు చెప్పినట్లు గుర్తుచేశారు. రావొద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి.. తనకు భద్రత కల్పించలేదని వైఎస్ జగన్‌ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కంటే.. వైఎస్ జగన్ గొప్పవారు కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
Read Entire Article