వైఎస్ జగన్ క్రేజ్ చూశారా.. జనాలు గట్టిగానే వచ్చారే

4 weeks ago 3
కడప జిల్లాలోని పులివెందుల – తాతిరెడ్డిపల్లె మార్గంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు.. దారి పొడువునా జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. పల్లెల జనం బుధవారం రోడ్డుపైకి వచ్చేశారు.. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు.. తమ అభిమాన నాయకుడు, పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు 11 గంటలకు బయలుదేరారు. సాయంత్రం ఐదు గంటలకు ఆలయం వద్దకు వచ్చే సరికి ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసింది. వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోదండరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ మూర్తులకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. కాగా, ఈ ఆలయ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 34 లక్షల రూపాయలు మంజూరు చేశారు.
Read Entire Article