వైసీపీకి గురువారం డబుల్ షాకులు తగిలాయి. ఇద్దరు ముఖ్య నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. వారిలో ఒకరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే మరొకరు పవన్ కళ్యాణ్‌ను 2019 ఎన్నికల్లో ఓడించి సంచలనం రేపిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. రాజీనామా లేఖలను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపిన ఇద్దరు నేతలు.. పార్టీ విధానాలపై, వైఎస్ జగన్ తీరుపైనా మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అవంతి శ్రీనివాస్ జనసేన వైపు, గ్రంధి శ్రీనివాస్ టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.