ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు.మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. అలాగే వైఎస్ఆర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన గండికోట గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. గండికోటలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించినట్లు సమాచారం.