ఏపీ రాజకీయాల్లో మరోసారి వైఎస్ఆర్ మరణం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఓ ప్రభంజనం. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆయన 1,470 కి.మీ. నడిచి.. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. నేటితో ఆయన పాదయాత్ర ముగిసి 23 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నాయి. అయితే, ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్స కన్నీటి పర్యంతమయ్యారు.