వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఏఎస్పీ రాంసింగ్ అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇవ్వమని గతంలో నన్ను ఇబ్బంది పెట్టారని మాజీ పీఏ కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌లపై కృష్ణా రెడ్డి పెట్టిన కేసు తప్పుడు కేసని పులివెందుల పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు విచారణ తుది నివేదికను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్.. కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు నెలలుగా 23 మంది సాక్షులను పులివెందుల డీఎస్పీ విచారించారు. చివరకు సునీత రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రామ్ సింగ్ ముగ్గురిపై కృష్ణారెడ్డి పెట్టింది ఫాల్స్ కేసని పోలీసులు తేల్చేశారు. అలాగే తప్పుడు కేసు పెట్టిన కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.