YS Vivekananda Reddy Case Telangana High Court: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి మరోసారి ఆసక్తికర పరిణామం జిరిగింది.కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని, పలు అనుమానాలకు సమాధానాలు రాలేదని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైఎస్ సునీతారెడ్డి పేర్కొన్నారు.