ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనన్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరితే ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని వైయస్ఆర్‌సీపీ బాయ్‌కాట్ చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సభలో కోరామన్నారు. ప్రతిపక్షమంటే ప్రజల పక్షమని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గవర్నన్ ప్రసంగంలో డిమాండ్ చేశామన్నారు. సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షమన్నారు. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందని, ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే అన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించామన్నారు.