Paderu MLA Visweswara Raju Saved A Man: అల్లూరి జిల్లా పాడేరు మండలం రాయిగడ్డ దగ్గర వరదలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యే సాహసం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించేందుకు వెళ్లారు.. అదే సమయంలో ఓ యువకుడు బైక్‌పై వాగును దాటేందుకు ప్రయత్నించాడు.. అయితే మధ్యలో మధ్యలో చిక్కుకున్నాడు. యువకుడిని గమనించిన ఎమ్మెల్యే సాహసం చేసి వాగులోకి దిగి అతడిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. యువకుడిని కాపాడిన ఎమ్మెల్యేను పలువురు ప్రశంసిస్తుండగా.. ఈ వీడియో వైరల్ అవుతోంది.