Botsa Satyanarayana Mlc Nomination: విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌కు సమర్పించారు. మరోవైపు మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ ఆస్తులు రూ.73.14 లక్షలు పెరిగాయి. ఎమ్మెల్సీ స్థానానికి వేసిన నామినేషన్ పత్రాల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు.