Nagari Kj Shanthi Kumar Suspended From Ysrcp: నగరి నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీలో కీలక పరిణామం జరిగింది. పార్టీలో కీలకంగా ఉన్న కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్తురు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.