హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతున్నాయి! తాజాగా వైకాపా నేత కుమారుడు లక్ష్మీ విజయ్‌కుమార్ కోట్ల రూపాయలు కొల్లగొట్టి అరెస్టయ్యాడు. ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరుతో వందలాది మందిని మోసం చేశాడు. అతనికి అసలు భూములే లేకున్నా ఉన్నట్లు నమ్మించి నిండా ముంచాడు. ఈ మోసంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండాలని పోలీసులు సూచించారు.