అమరావతిలో నిర్మించినవి తాత్కాళిక భవనాలని తామెన్నడూ చెప్పలేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. వైసీపీ ఎమ్మెల్సీలపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో భారీగా అప్పులు చేశారన్న అచ్చెన్నాయుడు.. ఆ డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు. ఇసుక, మైన్స్ ఇలా అన్ని రంగాల్లోనూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని 8 నెలల్లో గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా బొత్స, అచ్చెన్న మధ్య మాటల యుద్ధం నడిచింది.