Kurasala Kannababu Get Land In Telangana Journalist Quota: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు స్థలాలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 38 ఎకరాలు కేటాయించగా.. ఆ మెమోను జర్నలిస్టులకు అందజేశారు. అయితే తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లూ కేటాయిస్తూ ప్రభుత్వం ఓ జాబితాను విడుదల చేసింది. ఆ లిస్టులో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి పేరు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాబితాలో ఆయన పేరు కనిపిస్తోంది.