లిక్కర్, ఇసుక, గనులు, భూముల మీద వైసీపీ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వీటి గురించి శాసనమండలిలో ప్రశ్నలు వేసి గౌరవం తగ్గించుకోవద్దని సూచిస్తున్నామన్నారు. గతంలో అక్రమ రవాణా, నాసిరకం మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉండేదని, నాసిరకం మద్యం నియంత్రించడం సహా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రతిపైసా ప్రభుత్వానికి జమ అవుతుందని అచ్చెన్న తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వస్తుందో లేదో అని ఎన్నికల ముందు డిస్టలరీలు ఎక్కువ స్టాకు తెచ్చి పెట్టారని, సొంత డిస్టిలరీల నుంచి తయారు చేసిన బ్రాండ్లను రాబోయే 8 నెలలకు సరిపడా స్టాక్ పెట్టారని, ఆ స్టాక్‌ను ఏం చేయాలో తెలియక వాటిని విక్రయిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు.