Karanam Balaram Chandrababu Meet: గుంటూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అదే సమయంలో చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం అక్కడే ఉన్నారు. అయితే ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరణం బలరాం 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున గెలిచి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.