Ysrcp New Social Media In Charge Ashok Reddy: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండేందుకు.. కేడర్‌లో జోష్ నింపేందుకు కొత్త సోషల్ మీడియా ఇంఛార్జ్‌ను రంగంలోకి దించారు. ఈ మేరకు తనను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా వైఎస్ జగన్ నియమించారని సోషల్ మీడియా వేదికగా అశోక్ రెడ్డి అనే వ్యక్తి ప్రకటించారు. ఆయనకు పార్టీ కేడర్, నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.