వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు.. ఇది ఫిక్స్: పవన్ కళ్యాణ్

1 month ago 5
ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన.. తమ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వాళ్లకి ఆ హోదా దక్కేది అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని.. సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయాలన్నారు. సంఖ్యకు అనుగుణంగా స్పీకర్‌ సమయం కేటాయిస్తారన్నారు.. వైఎస్సార్‌సీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా రాదని.. వాళ్లని అవమాన పరచాలనో.. తగ్గించాలనో కాదన్నారు. ఆ హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాల్నారు. ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు జర్మనీ వెళ్లిపోవాలని ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Read Entire Article